Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

వేములవాడలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర.. డప్పు వాయిస్తూ సందడి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Author SAMAJA HITHAM | 23 Sep 2026, 02:42 PM | రాజన్న సిరిసిల్ల
వేములవాడలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర.. డప్పు వాయిస్తూ సందడి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ను ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డప్పు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

వినాయక నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గుడి చెరువులో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని అలాగే ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని ఆయన అన్నారు.