Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

భూవివాదంలో ఇద్దరిపై దాడి..నలుగురు నిందితులకు రిమాండ్

Author SAMAJA HITHAM | 29 Sep 2026, 12:23 AM | రంగారెడ్డి
భూవివాదంలో ఇద్దరిపై దాడి..నలుగురు నిందితులకు రిమాండ్

- భూవివాదంలో ఇద్దరిపై దాడి..నలుగురు నిందితులకు రిమాండ్.

- గొడ్డలి, కర్రలు, రాళ్లతో దాడి.. షాబాద్ పోలీసుల కేసు నమోదు.

షాబాద్, సెప్టెంబర్ 28 (సమాజహితం): భూవివాదం నేపథ్యంలో ఇద్దరిపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులను షాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామ శివారులో ఈ నెల 25న రాత్రి 8 గంటల సమయంలో భూవివాదం నేపథ్యంలో తొంట వెంకటేష్,తొంట చిన్న రాములుపై నర్సిములు, పెద్ద రాములు, అభిషేక్, అఖిల్‌లు గొడ్డలి, కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ దాడిలో వెంకటేష్ ఎడమ అరచేతికి లోతైన గాయం కాగా, చిన్న రాములుకు ఎడమ కంటి సమీపంలో గాయంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దాడికి పాల్పడిన నర్సిములు, పెద్ద రాములు, అభిషేక్, అఖిల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సెప్టెంబర్ 28న నిందితులను చేవెళ్ల న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి