Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

చేర్ల కొండాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Author SAMAJA HITHAM | 02 Oct 2026, 10:17 PM | జగిత్యాల
చేర్ల కొండాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

- చేర్ల కొండాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
- సర్పంచ్ బాస లాస్య ఆనంద్ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం

చేర్ల కొండాపూర్, జగిత్యాల జిల్లా (సమాజహితం న్యూస్): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చేర్ల కొండాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాస లాస్య ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. గ్రామ పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని సర్పంచ్ బాస లాస్య ఆనంద్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛత, సామాజిక బాధ్యత, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. కార్యక్రమం సందర్భంగా గ్రామంలో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ, పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.