Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Author SAMAJA HITHAM | 05 Oct 2026, 11:31 PM | జగిత్యాల
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, అక్టోబర్ 05 (సమాజహితం న్యూస్): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని, ధర్మపురి, కోటిలింగాల తదితర పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి పుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉన్నందున రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఘాట్ల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ధర్మపురి ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం మొత్తం రూ.226.41 కోట్ల మేర ఎండోమెంట్స్, ఇరిగేషన్, పీఆర్‌ఈడీ, ప్రజారోగ్యం, నీటి సరఫరా-పారిశుధ్యం, టూరిజం, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖలకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. బోర్నపెల్లి, కమ్మునూరు, చిత్రవేణి గూడెం, గోదావరి పరివాహక ప్రాంతంలో భక్తులకు వసతులు, పుష్కర ఘాట్లు, రోడ్లు, విద్యుత్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ధర్మపురి, వెల్గటూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్‌పూర్, రాయికల్ మండలాల్లోని ఘాట్లలో మౌలిక వసతుల మెరుగుదల, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మపురి వద్ద 470 మీటర్ల మేర, కోటిలింగాల వద్ద 210 మీటర్ల మేర కొత్త ఘాట్ల పనులు మంజూరయ్యాయని, ఎండోమెంట్స్ శాఖ ద్వారా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కోటిలింగాల ఆలయాల అభివృద్ధికి చెరో రూ.10 కోట్ల చొప్పున పనులు ప్రారంభమయ్యాయన్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో అంతర్గత సీసీ రోడ్లకు రూ.15 కోట్ల మేర పనులు, నీటి సరఫరా, పారిశుధ్యానికి ప్రత్యేక నిధులు కేటాయించామని, పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కర అనుభవం కల్పించడమే లక్ష్యంగా నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్, మెట్‌పల్లి ఆర్‌డీవో నరసింహారావు, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, పంచాయతీ రాజ్, రోడ్డు భవనాల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవో లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.