Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి

Author SAMAJA HITHAM | 08 Oct 2026, 07:32 PM | జగిత్యాల
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి
చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని బోయిని హన్మాండ్లు డిమాండ్

మల్లాపూర్, అక్టోబర్ 8:
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు ప్రాంతాలకు వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీసీ సెల్ జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బోయిని హన్మాండ్లు ప్రభుత్వాన్ని కోరారు.
మల్లాపూర్ మండలంలోని పాత దామరాజుపల్లి, కొత్త దామరాజుపల్లి, వాల్గొండ, సంఘం, శ్రీరాంపూర్, వివిరావుపేట, గొర్రెపల్లి తదితర చివరి ఆయకట్టు గ్రామాల్లో సాగునీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వరి పంటలు కీలక దశలో ఉన్న సమయంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, తక్షణమే సాగునీరు విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
సాగునీటి కొరతతోపాటు ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయని, దీంతో పశువులకు సైతం తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హన్మాండ్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు గ్రామాల వరకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరంచంద్, కొమిరెడ్డి విజయ్ ఆజాద్‌ల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వారు ఈ అంశాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు సాగునీరు అందేలా చర్యలు కోరనున్నారని చెప్పారు. అవసరమైతే నీటి విడుదల కోసం న్యాయపరమైన మార్గాలను కూడా పరిశీలించాలని కోరినట్లు పేర్కొన్నారు.
రైతులకు సాగునీరు అందే వరకు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా బోయిని హన్మాండ్లు తెలిపారు.