Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

అభివృద్ధి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

Author SAMAJA HITHAM | 09 Oct 2026, 10:33 PM | జగిత్యాల
అభివృద్ధి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అభివృద్ధి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, అక్టోబర్ 09 : విబిజిరాంజీ కింద జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి నిర్మాణ పనులు, గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, వంటశాలల నిర్మాణాలు, పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, పాఠశాలల్లో వంటశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా పూర్తి కావాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే ఈ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టిన పనులు ప్రజలకు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో వంటశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈపీఆర్ లక్ష్మణరావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.