Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి

Author SAMAJA HITHAM | 09 Oct 2026, 10:37 PM | జగిత్యాల
సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి

జగిత్యాల, అక్టోబర్ 09 ( సమాజహితం న్యూస్ ) : సమాచార హక్కు చట్టం-2005 కింద అందిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఉన్నతాధికారులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు వారోత్సవాలు-2026 నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం కింద పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు తమకు నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో తెలుసుకొని విధులు నిర్వహించాలని ఆదేశించారు. చట్టం ప్రకారం ప్రజలకు అందించాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం, ప్రభుత్వ శాఖలు స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అధికారుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమాచార హక్కు దరఖాస్తులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినా, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోయినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. వై ప్రసాద్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కిషన్, సూపరింటెండెంట్ జ్యోతి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.