బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి డైరీ ఫార్మ్ సమీపంలో చెట్ల పొదలలో పోలీసులకు మానవ అస్తిపంజరం లోని పుర్రె,ఎముకలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. తెల్లవారుజామున ఓ వ్యక్తి అటువైపుగా వెళ్తూ చెట్టుకు వేలాడుతున్న పుర్రె ఎముకలను చూసి భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పుర్రెతోపాటు ఎముకలను స్వాధీనం చేసుకుని డిఎన్ఏ పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఈ పుర్రె ఎముకల కు సంబంధించిన ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే సదరు వ్యక్తి మరణించి ఉంటాడని అతనికి సంబంధించిన పుర్రె ఎముకలను డైరీ ఫాం రహదారి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోని చెట్టుకు వేలాడదీసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అతనిని ఎవరైనా హత్య చేసి అక్కడ వదిలేసి వెళ్లారా లేదా మరి ఏదైనా క్షుద్ర పూజలు కోసం పుర్రె,ఎముకలను తీసుకువచ్చారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయితే స్పష్టత వస్తుందని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు తెలిపారు.
బోయిన్పల్లి పీఎస్ పరిధిలో మానవ పుర్రె, ఎముకలు లభ్యం ..!!
