శిలాఫలకంపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడు, సఖినేటిపల్లి గ్రామాలలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు. ఈ సందర్భంగా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ద్వంసం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. సఖినేటిపల్లి ఎస్సై దుర్గా శ్రీనివాస్ కి అందని సమాచారంతో సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది సముద్ర తీరం వద్ద సుమారు 5 కేజీల గంజాయి కలిగివున్న 7గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని. విచారణ సమయంలో కొల్లాటి ధర్మరాజు, రాయుడు యశ్వంత్ ఇద్దరు నిందితులు మద్యం, గంజాయి మత్తులో శిలాఫలకాలపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధ్వంసం చేసినట్లు నిర్ధారించినట్లు తెలియజేశారు.

అలాగే మండలంలోని మోరిపోడు గ్రామంలో ఒక ఇంటిపై రాళ్లు విసిరి ధ్వంసం చేసిన సంఘటనలో కూడా వీరు ముద్దాయిలని సిఐ సురేష్ బాబు తెలిపారు. గంజాయి తో దొరికిన కొప్పనాతి దుర్గాప్రసాద్ అలియాస్ రింటూ సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన ఇతను గత కొంతకాలంగా నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి తన బృందం ద్వారా హైదరాబాదు తరలించి విక్రయిస్తుంటాడని చెప్పారు. ఎక్కువ మొత్తంలో కొన్న గంజాయిని రాయుడు యశ్వంత్, కొల్లాటి ధర్మరాజు (ధర్మ), చెల్లుబోయిన భగవాన్ (చింటూ), కడలి ప్రదీప్ కుమార్ (పాండు), మత్తి ఆనంద్ కుమార్, కడలి హర్షవర్ధన్ ల సాయంతో హైదరాబాద్ తరలిస్తుంటాడని వీరందరినీ అరెస్టు చేసి రాజోలు కోర్టులో హాజరు పరచగా వచ్చే నెల మూడో తారీకు వరకు రిమాండ్ విధించినట్లు సురేష్ బాబు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress