ఆయుధాలతో కొట్టి..కరీంనగర్ లో భారీ దోపిడీ!

కరీంనగర్ లోని భగత్ నగర్ లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతుల పై ఆయుధాలతో విరుచుకుపడిన దొంగలు విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఆయుధాలతో బెదిరించి వారి వద్ద ఉన్న 50 తులాల బంగారం, రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా దోపిడీ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి లైట్ ఆఫ్ చేసేందుకు వచ్చిన అజ్మత్ అలీ (81) పై దొంగలు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి, ఇంట్లోని మరో వృద్ధురాలిని కట్టేశారు. తీవ్రంగా గాయపడిన అలీ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు, ఘటనా స్థలంలో ఒక డమ్మీ పిస్టల్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress