జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సు అపహరణ కలకలం రేపింది. డిపోలో నిలిపి ఉంచిన బస్సును గుర్తుతెలియని వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా తీసుకెళ్లడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. డ్రైవర్ చాకచక్యం, పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బస్సు మార్గమధ్యంలో పలువురిని ఢీకొట్టినట్లు సమాచారం. చివరకు ఇబ్రహీంపట్నం మండలం హనుమాన్ ఆలయం సమీపానికి చేరుకున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోవడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు అపహరణ ఘటన కోరుట్లతో పాటు జగిత్యాల జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ బస్సు చోరీ.. కోరుట్లలో సినిమాను తలపించిన ఛేజింగ్..!!
